"శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరి కలయికే "శివరాత్రి''. వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన
దంపతులు పురాణాలలో కనిపించరు. అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికి నాంది
అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికికంతటికీ పర్వదినం అయింది. అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే
విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య
వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తెజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞామోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ
చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం
ఆచారమైంది. ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం
అలవాటైపోయింది.
