శివతత్త్వం
శివతత్త్వం
"శివం'' అంటే.. "కదలిక లేని", "చలనంలేని" అని అర్థం వుంది. అంటే "జడత్వం'' అని కాదు. ఎటూ కదలడానికి వీలులేని.. అని అర్థం. అంటే "సర్వం వ్యాపించి వున్న".. అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే;;. ఆయన కదలడు. ఈ సృష్టినంతటినీ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు.. జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం''
"పూర్ణమదః పూర్ణమిదం పూర్ణత్పూర్ణముదచ్చతే |
అని :ఈశావాస్యోపనిషత్తు'' శివతత్త్వాన్ని కీర్తిస్తుంది. అదే ఆద్యంతాలు లేని ఈశ్వరతత్త్వం.
Subscribe to:
Posts (Atom)

















.gif)





