శివుని ఆకారంలోనే ఎంతో అర్థం వుంది. ఆయన అర్థనారీశ్వరతత్త్వము ప్రకృతి పురుషుల
సమాహారమైన ఈ సృష్టికి సంకేతము. ఆయన త్రినేత్రాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు
ప్రతీకలు. ఆయన ధరించే భస్మం, చితాభస్మం. "చివరకు సర్వం కలిసేది నాలోనే'' అనే వేదాంత సారానికి
చిహ్నం ... భస్మం. శివుని చేతిలో ఒక లేడి
వుంటుంది. సారంగమంటే లేడి. చంచలమైన మనసుకి అది ప్రతీక. ఇంద్రియనిగ్రహముతో ఆ మనసును
అదుపులో పెట్టేవాడు కనుక శివుని "సారంగపాణి'' అంటారు. ఆయన చేతిలోని
డమరుకం నుంచే శబ్దశక్తి ఉద్భవించింది. అదే సంగీతానికి వేదం. అందుకే శివుని
"నాదలోలుడు''
అన్నారు. ఆయన పదవిన్యాసం నుంచి జనిన్చిందే "నాట్యశాస్త్రం''. ఆయన చేతిలోని
రుద్రాక్షమాల, ఆకారం నుండి క్షకారం
వరకూ వున అక్షరామాలకు ప్రతీక. అందుకే ఆయన "జగద్గురువు''. కుండలి అంటే నాగము
ప్రాణుల దేహములందున్న సప్తచక్రాలలో కుండలి రూపంలో చరించే ప్రానదాతువు ఆయనే. అందుకే
ఆయనను నాగాభారణుడు అన్నారు.
"ఈశ ఐశ్వర్యే'' - అష్టైశ్వర్యప్రదాత కనుక, ఆయన "ఈశ్వరుడు''.
"శివ ప్రదత్వాత్ శివః'' - శుభములను ఇచ్చువాడు కనుక
... ఆయన "శివుడు''
"శం సుఖం కరోతీత శంకరః' - సుఖములను ఒసగువాడు కనుక, "శంకరుడు''
"మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవః'' - శ్రేష్ఠుడైన దేవదేవుడు
కనుక, "మహాదేవుడు''
"భుక్తానాం ఆర్తిం హారతి ఇతి హరః'' - భక్తుల బాధలు హరించువాడు
కనుక, "మహాదేవుడు
"భవతి భావతేవా సర్వమితి భవః'' - అంతా తనే అయివుంటాడు కనుక, "భద్రుడు
"ప్రళయే అపి తిష్టితీతి స్థాణు:'' - ప్రళయ కాలమందు కూడా
స్థిరముగా ఉండేవాడు కనుక "స్థాణువు''
"రుద్రం రోదనం ద్రావయతేతి రుద్రః'' - దుఃఖములను పోగొట్టువాడు
కనుక, "రుద్రుడు''
"శృణాతిహినస్తి సర్వమన్తకాలే ఇతి శర్యః'' - ప్రళయకాలమందు సమస్తమును
దాహించువాడు కనుక "శర్వుడు''
ఇలా ఆయన ప్రతిపేరిలోనూ మహత్తరమైన అర్థం
ఉంది. శివునకు "పశుపతి'' అని మరో పేరుంది. అంటే పశువులకు భర్త అని అర్థం కాదు.
"బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతా: పశవః
పరికీర్తితాః
తేషాం హాయ్ నాయకో యస్మాత్ శివః పశుపతి: స్మృతాః''
బ్రహ్మ మొదలుగా స్థావర జంగామాత్మకమైన ఈ
సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి. ఈ పశువులన్నింటినీ శివుడు నాయకుడు కనుక, ఆయన "పశుపతి'' అయినాడు. అందుకే - "నం భావాయచ రుద్రాయచ
నమశ్శార్వాయచ పశుపతయేచ్''
