"అభిషేక ప్రియం
శివః'' అన్నారు. శివుడు
అభిషేకప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునలు చాలా యిష్టం. ఇందులో
అంతరార్థం ఏమిటంటే -
"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే
శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు
"నీరు'' అంటే చాలా
యిష్టం. అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ
స్పర్శానుభూ
"శివాయ
విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య
హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ...
చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న
"జలాభిషేకం''
అంటేనే శివునకు ప్రీతికరం. అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం.
ఎందుకంటే "గంగ''
"విష్ణుపాదోద్భవ''
విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అన్డుకేం శివుడు, గంగను తన శిరసున ధరించి
గౌరవించాడు.
ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం
"చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో
తొలి అభిషేకంగా జరుగుతుంది. ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం
...ఎందుకంటే "జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం
మారేడుదళాలతో, తుమ్మిపూలతో
అర్చించాలి. నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో "శివ'' అనే రెండు అక్షరాలు
"జీవాత్మ'' అనే హంసకు రెండు
రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి "శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన
సులభమార్గమని,
"వాయుపురాణం'' చెబుతుంది.
"వేదేషు శతరుద్రీయం, దేవతాను
మహేశ్వరః'' అనునది సూక్తి.
దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో
శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని
ఆవస్తంబు ఋషి చెప్పాడు. అందుకే, శివుని
ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ
మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
"శివరత్రౌ
అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |
ఆర్చయేద్వా
యధాన్యాయం యధాబలమ చకం ||
యత్ఫలం మమమ
పూజాయాం వర్షమేకం నిరంతరం |
తత్ఫలం
లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను
అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం
చేసి, ఆ రాత్రి శివాలయ
ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు
పూర్తిగావించుకుని,
శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి.
లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా
అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, "ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు
సాంబశివుడు.
నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ
రూపంతో పూజించినా,
ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య
విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"
లింగాభిషేకములో పరమార్ధం :-
పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం -
భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం
చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం.
జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.
శివ షడక్షరీ స్తుతి (Shiva Shadakshari Stuti)
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమ:
శివాయ వేద్యాయ నాథాయ గురవే నమ:
ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్
అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:
న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర
నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:
మ:
మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం
మహా నటవరం వందే మకారాయ నమో నమ:
షి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్
శివమేకపదం దేవం శికారాయ నమో నమ:
వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్
వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:
య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర:
యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:
ఓం ఓంకారామంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన:
కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ:
మహాదేవ:
పరో మంత్ర: మహాదేవం: పరం తప:
మహాదేవ:
పరా విద్యా మహాదేవ: పరా గతి:
ఓం నమ: శివాయేతి చ షడ్లింగాయ నమో నమ:
మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:
శివాయ సోమాయ సతారాయ షడత్మనే
స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:
మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:
శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే
ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ:
నమ:
శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:
గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:
జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్
తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్
ఋత్గగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్
ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమోమ్యహమ్
ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం
ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్వయమ్
గోభీ ర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ
ప్రజయా పశుభి: పుష్కరాక్షం
త న్మే మన: శివసంకల్పమస్తు
సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా
శాంతి:
పత్నీ క్షమా పుత్ర: షడతే మమ బాంధవా:
ఇతి షడక్షరీ స్తుతి:
